Thursday, December 2, 2010

ఆరెంజ్... నేనూ, మా ఆవిడా

నిన్నే ఆరెంజ్ సినిమా చూశాం. నాకేమో నచ్చీనచ్చకుండా నచ్చింది. మా ఆవిడకు మాత్రం నచ్చింది.
ప్రేమ జీవితాంతం ఉంటుందా ఉండదా అనే పాయింటు మీద సంఘర్షణే సినిమా. కత ఇప్పటికే చాలా బ్లాగుల్లో చెప్పేశారు కాబట్టి దాని జోలికి పోదల్చుకోలేదుగానీ... నాకెందుకో ఈ సినిమా చూస్తున్నంతసేపూ స్వయంవరం సినిమా గుర్తొచ్చింది.
               అందులో వేణు ‘ప్రేమిస్తాగానీ పెళ్లి చేసుకో’నని చెబుతుంటాడు. దానికి సదరు పాత్ర చెప్పే కారణాలు తనచుట్టూ ఉండే భార్యాభర్తలు రోజూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండటమే. కాకపోతే ఆరెంజ్ లో హీరో చెప్పే కారణం ప్రేమిస్తే అబద్ధమాడాల్సి వస్తుంది. అలా ఆడ్డం తనకిష్టం ఉండదు. అన్నీ నిజాలే చెప్తే ఆ ప్రేమ ఎక్కువ కాలం నిలవదన్నది హీరోగారి థీరీ. (ఏప్రిల్ 1 విడుదల సినిమాలో దివాకరంలా బతుకు బస్టాండయిపోతుంది, ఆ మాట నిజమే).
              ఇక్కడో చిన్న చిక్కుంది. యండమూరి వీరేంద్రనాథ్ అదేదో నవల్లో చెప్పినట్టు ‘నేను నిజాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్తాను’ అంటే చెప్పొచ్చు. కానీ దానివల్ల చాలాసార్లు మిగిలేది కుండ పెంకులే(సినిమాలో కూడా నాగబాబు క్యారెక్టర్ తో ఇదే చెప్పించాడు. ‘ఇలా తప్పులు వెతుక్కుంటూ పోతే కారణాలే మిగులుతాయి... ప్రేమ మిగలదు’ అని).
         వీరేంద్రనాథ్ చెప్పింది కూడా వినాలా అంటారా? అయితే మన పెద్దలు చెప్పిన మాట కూడా ఒకటుంది... సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్... అని. అవతలి వ్యక్తికి ప్రియం కలిగించని నిజాలు చెప్పడం కూడా ఒక్కోసారి పనికిరాదు మరి. అయినా ప్రేమంటే నమ్మకం. ‘అదే ఎంత కాలం ఉంటుందో తెలీదు’ అని అపనమ్మకంతో మొదలెడితే...?
            అదీకాక హీరో చెప్పే కారణం అతని తొలి ప్రేయసికున్న అనుమాన గుణం(లేదా ఓవర్ పొసెసివ్ నెస్) కారణంగా ఇతగాడు ఆ అమ్మాయితో అన్నీ అబద్ధాలే చెప్పాల్సి రావడం. ఇక్కడ మిస్సయిన లాజిక్ ఏంటంటే... అమ్మాయిలందరూ అలాగే ఉంటారని గ్యారంటీ లేదు. పోనీ అలా అనుకుంటే హీరోగారు ‘నిజమైన ప్రేమ’ కోసం వెతక్కూడదు. కానీ వెతుకుతుంటాడు. అమ్మాయి దొరికినప్పుడు మాత్రం నిజమైన(పోనీ లాంగ్ లాస్టింగ్) లవ్ ఉండదంటాడు.

           ఇదెక్కడి పితలాటకంరా నాయనా!
           ఇక సినిమాలో నాకు నచ్చిన పాయింట్లు... ప్రేమలో నిజాయతీ ఉండాలన్నది నాకు నచ్చిన పాయింటు.  సిడ్నీని అందంగా చూపించడంలో 100కి 200 మార్కులు. బ్రహ్మానందం, జెనీలియా ఎపిసోడ్ ఫన్నీగా ఉంది. పాటలు బాగున్నాయి. కానీ.... ఏదో వెలితి!
             అందుకే నాకు నచ్చీనచ్చకుండా నచ్చిందన్నాను.




ఇక మా ఆవిడ వెర్షన్: 
కింద కోట్స్ లో ఉన్న మాటలన్నీ తను చెప్పినవి చెప్పినట్టు రాశా. అచ్చరమ్ముక్క కూడా మార్చలేదని మనస్సాక్షి, దైవసాక్షిగా చెప్తున్నాను(నిన్నటి మంత్రుల ప్రమాణ స్వీకారం ఎఫెక్టు:-))


‘‘అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలకు పొసెసివ్ నెస్ ఒక పిసరు ఎక్కువ. భర్త (లేదా) ప్రియుడు తన సమక్షంలో ఎక్కువ సేపు ఉండాలనుకుంటారు. నేనయితే అలాగే ఫీలవుతా. సినిమా చివర్లో కూడా చూడు... రాంచరణ్ ని గ్రాఫిటీ మానెయ్యమన్న జెనీలియా, అతను మారగానే గ్రాఫిటీని కంటిన్యూ చేయమంటుంది. నాకోసం నువ్వు మారితే నీకోసం నేను మారతా అన్నట్టు చెబుతుంది. అయినా అమ్మాయిలు అలా చెప్పేది మగవాళ్ల మంచికే. సిగిరెట్లు మానేయమన్నా, అభిరుచి పేరుతో గాలితిరుగుళ్లు తిరిగేకన్నా మంచి ఉద్యోగంలో చేరమని చెప్పినా వాళ్లమంచికే. సినిమాలో ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది. కానీ ఈ పాయింట్ ని చెప్పడంలో డైరెక్టర్ కన్ఫ్యూజ్ అయ్యాడు’’

సివరాకరికి నాకర్థమయ్యిందేంటే... ఇద్దరం చెరో యాంగిల్లో చూశాం సినిమాని అని!

33 comments:

  1. ఈ సినిమాగురించి ఇప్పటిదాకా చదివిన రాతల్లో కాస్త ఆలోచన ఉన్న రాత మీదే!
    మీ శ్రీమతిగారు చెప్పింది 100% కరక్టు. మీరు గనక బుద్ధిమంతులయి ఉంటే ఈ సంగతి మీకీపాటికి ఆల్రెడీ తెలిసుండాలి. :)
    ఇహ ప్రేమ విషయానికొస్తే - ఒకసారి మొదలైన ప్రేమ జీవితాంతం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొట్టుకున్నంత మాత్రాన, అభిప్రాయభేదాలు వచ్చినంత మాత్రాన ప్రేమ లేదని కాదు. ప్రేమ ఉన్నచోటనే కోపమూ, ఉక్రోషమూ, కీచులాట్లూ అన్నీ ఉంటాయి. అసలు గొడవంతా - ప్రేమ అని దేన్ని పిలుస్తున్నామో .. అంటే డైరట్రు ఉద్దేశంలో, ప్రేక్షకుల ఉద్దేశంలో .. అసలు ప్రేమ అంటే ఏంటి - అనే దానితో గొడవ.

    ReplyDelete
  2. కొత్తపాళీగారూ...
    ఔనౌను, కరెక్ట్ గా చెప్పారు, ప్రేమ అంటే ఏంటనేదే అసలు గొడవ. నాకు పేరు సరిగా గుర్తు లేదుకానీ... కథాసరిత్సాగరంలో ఒక కథ ఉంటుంది. అందులో ఒక బ్రహ్మచారి వేశ్య అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతుంటాడు. ఒక ప్రశ్నకు సమాధానంగా ‘అమ్మాయి మనసులో స్థానం సంపాదించే మార్గం ఆ అమ్మాయి చెవి’ అంటాడు. అంటే ప్రియమైన మాటలతో ఆకట్టుకోవచ్చని. అయితే ఆ ప్రియమైన మాటల్ని మగవాడు మోసం చేయడానికి చెబుతాడా, సంసారం(ప్రేమ) ఆనందంగా ఉండటానికి చెబుతాడా అనేది సదరు మగాడి క్యారెక్టర్ పైన ఆధారపడి ఉంటుంది. నేను మాత్రం ఆ కథ చదివినప్పటి నుంచీ అదే ఫాలో అయిపోతున్నా. వంద శాతం రిజల్ట్ గ్యారెంటీ పద్ధతి అది. నా మటుకూ నాకు ప్రూవ్ అయిన సత్యం.

    ReplyDelete
  3. బైరాగి ప్రచండDecember 2, 2010 at 11:50 PM

    @@@@@@అయినా అమ్మాయిలు అలా చెప్పేది మగవాళ్ల మంచికే

    ఇంకో ఆవిడ ప్రేమ తో ఏవండీ...మా అమ్మ కి పది తులాల బంగారం కొంటాను అని చెబుతుంది ఇది ఎవరి మంచి కోసం?

    అమ్మాయిలు అంటే ఇక్కడ పెళ్ళికాని అమ్మాయి పెళ్లి అయిన మగాడితో అయితే ఈ లాజిక్ ఓకే..కానీ చిల్లు పడేది అబ్బాయికే కదా

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. వేణూరామ్ గారూ... నెనర్లు. నిన్ననే మీ చిత్రం బ్లాగు చూశానండీ. నాక్కూడా ఫొటోగ్రఫీ పిచ్చి(కెమెరా పిచ్చోణ్ని). మీ ‘పి100’తో తీసిన ఫొటోలు సూపర్. ఎవరైనా ఆ మోడల్ కెమెరా కొంటానంటే మీరు ఎస్ అంటారా... ‘నో’ చెప్తారా? మీరు తీసిన ఫొటోలు ఎంత ISOలో తీశారో తెలుసుకోవచ్చా?

    పద్మార్పితగారూ... నా ఓటు కూడా ఎప్పుడూ నా అర్ధాంగికే :) ఇక్కడ
    తను చెప్పిన విషయాన్నే నేనింకొంచెం డొంకతిరుగుడుగా చెప్పానంతే!

    లోకేష్ శ్రీకాంత్ గారూ... థాంక్యూ

    ReplyDelete
  6. అక్టోబరు 5 నుండీ అన్నీ నిజాలే చెపుతున్నా!! ఇదివరకు అబద్దాలు చెప్పేదాన్నా అంటే కాదు కానీ నా అభిప్రాయాన్ని నా మనసులోనే ఉంచుకునేదాన్ని, ఇపుడు బయటకు చెపుతున్నానంతే మళ్ళీ అక్టోబరు 5 వరకు ఇలాగే అన్నీ నిజాలే మాట్లాడతాను. ఇదో వెరైటీగా బాగానే ఉంది ప్రస్తుతానికి కానీ ముందు ముందు నా పరిస్థితి కూడా దివాకరం లాగా అవుతుందేమో చూడాలి. రోజూ ఒకేలాగా బ్రతికితే ధ్రిల్ ఏముంటుంది?

    ReplyDelete
  7. Concept is honest in Orange, but people are saying that director failed in conceiving it aptly on screen. Waiting to watch it soon :-)

    ReplyDelete
  8. బాచెప్పారండీ, నేను ఇంకా సినిమా చూడలేదుగానీ ఇక్కడ అక్కడ విన్నదాని బట్టి ఇది కొంచం డిఫరెంట్ సినిమా అన్న విషయం తెలుస్తోంది.

    ReplyDelete
  9. అవును, ఇలా చెరో యాంగిల్లోనూ చూస్తే ఇంటికొచ్చాక చాల్సేపు సినిమా గురించి మాట్లాడుకోవచ్చు. అలా చూస్తేనే బాగుంటుంది. నెమ్మది నెమ్మదిగా ఆరెంజ్ అసలు రంగు అందరూ బయట పెడుతున్నందుకు సంతోషం

    ReplyDelete
  10. బాలు గారు.. ధన్యవాదాలు.. నేనైతే "YES" అనే చెప్తా.. :) నేనింకా పెద్ద రిసెర్చ్ ఏమి చెయ్యలేదు లెండి నా కేమెర పై.. ISO 1600 లో పెట్టి తీసానండి .. :)
    మీ రివ్యు నాకు నచ్చిందండి.. :)

    ReplyDelete
  11. @ నీహారిక... బ్రేవో
    @ సౌమ్య... కొంచెం డిఫరెంటేనండీ! చిన్నపాయింట్ చుట్టూ రెండున్నర గంటల సంఘర్షణ. అందుకే సెకండాఫ్ లో ఒక దశలో కొద్దిగా బోర్ కొడుతుంది.
    @ సుజాత... చెరోయాంగిల్లో చూడ్డం వరకూ బానే ఉందండీ. ఎందుకు బాగుంది/బాగులేదు అని మాట్లాడుకుని(అసలైతే వాదించుకుని)పడుకునేటప్పటికి తెల్లవారుజామున రెండయిందండీ. అదే బాలేదు :)
    @ వేణూరాం... కెవ్వ్.....వ్వ్. ISO 1600 పెట్టి తీశారా. నా కెమెరాలో అయితే అంత ఐయ్యెస్వోలో చుక్కలు తప్ప ఫొటో రాదండీ. ISO 400 పెడితేనే ముక్కీమూలిగీ మొహమ్మీద ఉసుళ్లు ముసిరినట్టు తీస్తుంది ఫొటో. నేను నెక్స్ట్ కెమెరా అంటూ కొన్డం జరిగితే ఈ ‘నికాన్ కూల్పిక్స్ పి వంద’నే కొంటానండీ :)

    ReplyDelete
  12. @ రామకృష్ణారెడ్డి... పాయింట్ మంచిదేనండీ, తీయడంలోనే ఏదో వెలితి. అదేంటో నాకిప్పటికీ అర్థం కాలేదు :)

    ReplyDelete
  13. Also see review on Orange at: www.anekavachanam.wordpress.com

    ReplyDelete
  14. last lo genelia tho adjust ayyevadu....mundu 9 mandini enduku vadilesinatto??????vedhava logicu vadu nu.....

    ReplyDelete
  15. Just now I have watched the Orange movie. Really concept is good and some times lies needed for to continue the love.

    People want the new stories but some how don't like these kind of stories.

    Who likes this movie is: Married people and lovers

    Its looks like intentionally some people are writing wrong reviews about this movie. This is one of the best movie which has the real life concept and encountered by every human being in his life.

    If you miss this movie definitely you will not see the relation ship in other angle.








    It is

    ReplyDelete
  16. హీరో అనుకున్న ప్రేమ ఏమిటి? హీరోయిన్ అనుకున్న ప్రేమ ఏమిటి? మీరనకున్న (ప్రేక్షకులు) ప్రేమ ఏమిటి? ఎవరికీ అర్ధంకాని ఈ 'ప్రేమ ' విషయాన్ని వేరెవరికీ అర్ధం కాని రీతిలో తీసాడు ఈ బొమ్మరిల్లు (భూత్ బంగ్లా) భాస్కర్.

    ReplyDelete
  17. Movie is all about speaking only truth...which is also a fantasy ;)

    (director knows it that there is no happy person on the earth with this quality)

    with this truth concept you can not love any one forget about the life partner :P

    but the good practice of speaking only truth takes you to go in only path which is right path of the life :)

    ReplyDelete
  18. @Ambica


    Except Genelia no one tried to confirm about life time relation at the start of the proposals :D

    ReplyDelete
  19. @Anon

    హీరో అనుకున్న ప్రేమ ఏమిటి? హీరోయిన్ అనుకున్న ప్రేమ ఏమిటి? మీరనకున్న (ప్రేక్షకులు) ప్రేమ ఏమిటి? ఎవరికీ అర్ధంకాని ఈ 'ప్రేమ ' విషయాన్ని వేరెవరికీ అర్ధం కాని రీతిలో తీసాడు ఈ బొమ్మరిల్లు (భూత్ బంగ్లా) భాస్కర్.

    --------------------------------------


    dont worry much about the love...


    its all about defining the relation between truth and relations :))

    ReplyDelete
  20. @lakshman said... Who likes this movie is: Married people and lovers


    @వేణూరాం

    since u like the movie it seems you got gal friend or u r married ,please clarify ..:-)

    ReplyDelete
  21. This comment has been removed by the author.

    ReplyDelete
  22. @Mauli Garu....hammaya meku arthamyindanna mata.....andariki arthamyindo ledo ani aa quetion vesa hahhahehheh :)

    ReplyDelete
  23. @ మౌళి గారూ, బోలెడంత శ్రమ తీసుకుని నా బదులు సమాధానాలు చెప్పినందుకు థాంకులు.
    @ అంబిక గారూ నానోట్లో నానుతున్న ముక్క మౌళిగారి సమాధానంగా వచ్చేసింది. ఫస్టాఫ్ లో జెనీలియాని రామ్చరణ్ నంజుకు తింటే... చివరాకర్లో జెనీలియా మనోడి బుర్ర తినేస్తుంది పాపం!
    ‘ప్రేమించే క్షణం వచ్చినప్పుడు దాన్ని అందరూ ఉపయోగించుకుంటారు, కానీ విడిపోయే క్షణం వచ్చినప్పుడు అందరూ దాన్ని ఉపయోగించుకోరు’ అని రామ్ చరణ్ ఓ డైలాగ్ చెప్తాడో చోట. కానీ జెనీలియా ‘నిన్ను ప్రేమించట్లేదు’ అని చెప్పినప్పుడు ఆ క్షణాన్ని వినియోగించుకోడు పాపం. దీన్నిబట్టి నాకర్థమైందేంటే... అంతకు ముందు అతగాడి తొమ్మిది ప్రేమలూ ఆకర్షణలయ్యుంటాయి. జెనీలియాకు మాత్రమే అడ్డంగా పడిపోయుంటాడు మానవుడు.

    ReplyDelete
  24. ఏంటో ...ఈ సినిమా అర్ధం కావాలంటే ముందు రివ్యూలు చదవాలన్నమాట.

    ReplyDelete
  25. బాలు గారు,
    అసలు జెనీలియా ‘నిన్ను ప్రేమించట్లేదు’ అని చెప్పలేదు ఎక్కడా :)
    కాకపోతే తన ఇంట్రెస్ట్ ని తెలియ చెస్తు౦ది..అ౦దుకె తప్పి౦చుకొలెక తిప్పలు పడుతుంది..:)
    ఇక అ౦దరిని వదిలేసి జెనీలియా ను మాత్రం వదలకపోవడానికి మీరు చెప్పిన 'జల్సా' సినిమా కారణము కాదు ఇక్కడా..యె౦దుక౦టె ఆ అబ్బాయి ప్రేమ ను అ౦గేకరి౦చలెదు కదా ...

    ReplyDelete
  26. This comment has been removed by the author.

    ReplyDelete
  27. @ లలిత

    >>> ఏంటో ...ఈ సినిమా అర్ధం కావాలంటే ముందు రివ్యూలు చదవాలన్నమాట.



    అస్సలు కాదు అ౦డి. రివ్యూ ఎవరికి అర్ధమయ్యి౦ది వారు వ్రాస్తారు.అ౦త బాడ్ కాదు అనుకొంటే చూడడమే.

    మొదట షార్ట్ టైం లవ్వు కాన్సెప్ట్ అన్నారు ..ఇప్పుడు బోల్డన్ని వేరే కాన్సెప్ట్స్ కనిపిస్తున్నాయ్...

    నాకయితే పెద్దవాళ్ళకి తెలిస్తే నే కదా పిల్లలకి తెలుస్తు౦ది అని కూడా డౌట్ అన్నమాట.. వాళ్ళ పెద్దవాళ్ళకి తెలిస్తే వాళ్ళకు తెలిసేది ..కాబట్టి ఎవ్వరిని బ్లేము చెయ్యకుండా ఒక మార్పు ని రచయితా చెప్తున్నాడు.

    హీరో ఒక్కడే నిజం చెప్పేవాడు అయితే ఒకటి వాడు ఇల్లు కదలకూడదు.కాబట్టి పక్కింటాయన, ప్రకాష్ రాజ్ , ఫ్రెండ్స్ అ౦తా మారాల్సి వస్తు౦ది :ప

    బాలు గారు, నేను ఈ మూవీ పై రివ్యూ ఇప్పుడే వ్రాయలేను సో, మీ బ్లాగ్ లో వ్యాఖ్య ల పై నా అభిప్రాయం చెప్పాను.
    --
    Regards,
    Malleswari.

    ReplyDelete
  28. @బాలు గారు

    మీరు ఇలా వ్రాసారు:
    -----------------------------------------------------------------------------------------------------------------------
    అదీకాక హీరో చెప్పే కారణం అతని తొలి ప్రేయసికున్న అనుమాన గుణం(లేదా ఓవర్ పొసెసివ్ నెస్) కారణంగా ఇతగాడు ఆ అమ్మాయితో అన్నీ అబద్ధాలే చెప్పాల్సి రావడం. ఇక్కడ మిస్సయిన లాజిక్ ఏంటంటే... అమ్మాయిలందరూ అలాగే ఉంటారని గ్యారంటీ లేదు. పోనీ అలా అనుకుంటే హీరోగారు ‘నిజమైన ప్రేమ’ కోసం వెతక్కూడదు. కానీ వెతుకుతుంటాడు. అమ్మాయి దొరికినప్పుడు మాత్రం నిజమైన(పోనీ లాంగ్ లాస్టింగ్) లవ్ ఉండదంటాడు.

    ఇదెక్కడి పితలాటకంరా నాయనా!
    -----------------------------------------------------------------------------------------------------------------------

    అమ్మాయిల౦దరూ అలా ఉ౦డరని కూడా గ్యారంటీ లేదు సార్..నేను చెప్తున్నా కదా :)

    and

    హీరో నిజమైన ప్రేమ కోసం ప్రయత్ని౦చడు.అమ్మాయి తనకు నచ్చి౦దా లేదా అన్నమాట..తి౦గరి అమ్మాయి అని తక్కువ అ౦చనా వేసాడు..వాళ్ళే అతని తిక్క వదిలి౦చె వాళ్ళు అయ్యారు కాదా.. తి౦గరి అమ్మాయిల౦దరి తరుపునా జెనీ సేవలు (బొమ్మరిల్లు, ఆరె౦జ్ ) మేము అస్సలు మరిచిపోము :D


    ఇ౦కొ పితలాటకం కనిపిస్తు౦దా :)

    ReplyDelete
  29. మౌళిగారు,
    If i am not wrong... సెకండాఫులో జెనీలియా ‘నిన్ను ప్రేమించట్లేదు’ అని చెబుతుంది రాంచరణ్ తో.
    పాపం తింగరిదని లవ్ చేయడండీ, అ అమ్మాయి కళ్లల్లోనూ మరియూ నవ్వులోనూ ఇంకా ముఖములోనూ ‘నిజం’ కనిపించి ఫ్లాటయ్యానని చెబుతాడు గురుడు!
    ---
    "తి౦గరి అమ్మాయిల౦దరి తరుపునా జెనీ సేవలు (బొమ్మరిల్లు, ఆరె౦జ్ ) మేము అస్సలు మరిచిపోము :D"
    అంటే... అయ్ బాబోయ్ :)

    ReplyDelete
  30. పాపం తింగరిదని లవ్ చేయడండీ,


    >> gurthu techukondi, valla akkatho first yem chepthado :)

    ReplyDelete