ఎందుకో ఈ మధ్య దిగులేస్తోంది.
మొన్న రమణగారు... నిన్న నూతన్ ప్రసాద్...
మనకున్న కొద్దిమంది ప్రతిభావంతులు ఇలా ఒకరొకరుగా వెళ్లిపోతున్నారంటే మనసులో ఎక్కడో ఏదో తెలియని బాధ. ఎందుకో నిన్న నూతన్ ప్రసాద్ మరణవార్త వినగానే ‘రాజాధిరాజు’ సినిమా చూడాలనిపించింది. బాపు తీసిన ఈ సినిమాలో నూతన్ ప్రసాద్ సైతాను పాత్రలో అద్భుతంగా నటించాడు.
మనుషుల మనస్తత్వాల్లో కల్తీని ఎండగట్టేసిన రవణగారి మాటల్ని నూతన్ ప్రసాద్ గొంతులో వింటుంటే....
మొన్న రమణగారు... నిన్న నూతన్ ప్రసాద్...
మనకున్న కొద్దిమంది ప్రతిభావంతులు ఇలా ఒకరొకరుగా వెళ్లిపోతున్నారంటే మనసులో ఎక్కడో ఏదో తెలియని బాధ. ఎందుకో నిన్న నూతన్ ప్రసాద్ మరణవార్త వినగానే ‘రాజాధిరాజు’ సినిమా చూడాలనిపించింది. బాపు తీసిన ఈ సినిమాలో నూతన్ ప్రసాద్ సైతాను పాత్రలో అద్భుతంగా నటించాడు.
మనుషుల మనస్తత్వాల్లో కల్తీని ఎండగట్టేసిన రవణగారి మాటల్ని నూతన్ ప్రసాద్ గొంతులో వింటుంటే....
వినడమెందుకు, మీరే చూడండి.
ఆయన నటించినట్టు కాకుండా చాలా సహజంగా పాత్రలో కం ఫర్టబుల్ గా వొదిగిపోతారు. ప్రమాదం జరక్కుందా ఉండి ఉంటే మరిన్ని సినిమాల్లో నటించి ఉండేవారు.
ReplyDelete@అజ్ఞాత
ReplyDeleteఅవునండీ.
"మీ నిజం లో అబద్ధం కల్తీ,నవ్వులో ఏడుపు కల్తీ ...................................." నూటికి కోటి శాతం ముళ్ళపూడి మార్కు డవిలాగు.
ReplyDeleteదానిని నూతన్ ప్రసాద్ పలికిన తీరంటారా? అవును మరి అప్పట్లో విలన్లు బొంబాయి నుంచో ఢిల్లీ నుంచో దిగబడే వారు కాదుగా. అచ్చమైన తెలుగు తెలిసిన, తెలుగు బాషలో వాడి, వేడి స్పష్టం గా తెలిసిన నటుడాయే. ఆడేసుకున్నాడు.
(మనలో మనమాట పైన చెప్పిన డైలాగ్ ను సాయాజీ షిండే చెప్పినట్టు ఊహించుకోండి అప్పుడు తెలుస్తుంది నూతన్ ప్రసాద్ గొప్పతనం. ఏమంటారు? )
నూతన్ ప్రసాద్ పోయాడని తెలియగానే నాకు గుర్తొచ్చిన మొట్టమొదటి సినిమా రాజాధి రాజే. ఆ సినిమాలో బాపు-ముళ్ళపూడీ చెప్పదల్చుకున్న, చాలా మందికి అర్ధం కాని "శని తత్వం" అంతరారార్ధాన్ని "తన మాటల ద్వారా, భావ ప్రకటన ద్వారా అతను అద్భుతంగా పలికించాడు. "శని తత్వాన్ని"
ReplyDeleteఅందరికీ ఎడ్రస్ మారుతుందయ్యా.. ..కానీ ఆ డేట్ మటుకు ముందు తెలియదు"..అని ముళ్ళపూడి గారు చెప్పేవారు....ఆయనకీ, నూతన్ ప్రసాద్ కీ ఆ డేట్ ఇప్పుడే వస్తుందని అనుకోలేదు...
---వంగూరి చిట్టెన్ రాజు
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
హ్యూస్టన్, టెక్సస్
Hmmmm
ReplyDeleteThanks for the video బాలు గారు.
ఎపుడైనా పాత సినిమాలు చూసేటపుడు తను కనిపించిన ప్రతీసారీ ఆ ప్రమాదం జరగకుండా ఉంటే ఎంత బాగుండును అనుకుంటూనే ఉంటాను. నిజమే వరుసగా ఇద్దరినీ కోల్పోవడం దిగులుగానే ఉంది.
శంకర్ గారూ,
ReplyDeleteమీరు చెప్పింది నూటికి కోటిపాళ్లూ నిజం. దటీజ్ రవణగారు. అండ్... దటీజ్ నూతన్ ప్రసాద్. ఇంక ఆ డైలాగుని శాయాజీ షిండే మాటల్లో తల్చుకుని తల్చుకుని నవ్వుకుంటున్నాను. అయినా, అతని తెలుగు అలా ఉంటుంది కానీ, మంచి రంగస్థల నటుండండీ (అలాగని నూతన్ ప్రసాద్ తో పోల్చడం కాదండోయ్, ఆయనతో పోలిస్తే శాయాజీ సూర్యుడి ముందు దివిటీ).
చిట్టెన్ రాజుగారూ,
వీళ్లే కాదు, అంతకుముందు గుమ్మడిగారు, వేటూరి, పద్మనాభం... ఆ డేట్ వీళ్లందరి విషయంలో అయినా కనీసం మరికొన్నేళ్లు ముందుకు జరిగితే ఎంత బాగుండేది.
వేణూశ్రీకాంత్ గారూ,
నెనర్లు. హ్మ్, ఏంచేస్తాం!
హ్మ్, మంచి బిట్ చూపించారు. రాజాధిరాజు బాపూ గారు తీసినదా! నాకు తెలీదు. నూతన ప్రసాద్ గారి డైల్గాగు డెలివరీ మాత్రం శ్లాఘనీయం. విలనీ అయినా కామెడీ అయినా ఆయన మహాద్భుతంగా పండించగలరు. అహ నా పెళ్ళంట లో బకెట్ తన్నేస్తా అని చెప్పడం కోసం నిజం గానే బకెట్ ని తన్నేసి కింద పడిపోతుంటారు. దేశం చాల క్లిష్ణ పరిస్థితులలో ఉంది అన్న డైలాగు నాకు చాలా ఇష్టం.హేవిటో గొప్పోళ్ళందరూ ఒక్కక్కరుగా మనల్ని విడిచివెళ్ళిపోతున్నరు :(
ReplyDeleteశంకర్(SHANKAR) గారూ శాయాజీ షిండే అంటే నాకు చాలా గౌరవమండీ ఎందుకంటే తను నటిస్తున్న భాషకి గౌరవం ఇచ్చి, అది నేర్చుకుని తన డైలాగులు తను చెబుతున్నాడు. మిగతావాళ్లకి అదీ లేదుగా. అంతే కాక శాయాజీ మంచి నటుడు. అతను తెలుగులో డైలాగులు చెబుతున్నందుకు మనందరం సంతోషించాలి. అయితే నూతన్ ప్రసాద్ తో పోల్చలేము కానీ తక్కువచేసి పారేయలేము కూడా.
సౌమ్యగారూ,
ReplyDeleteఅవునండీ, రాజాధిరాజు బాపుగారు తీసిందే. చిన్నప్పుడెప్పుడో దూరదర్శన్‌లో ఆ సినిమా చూశాను. మళ్ళీ 2009లో షాపులన్నీ వెదికి ఆ సీడీ దొరకబుచ్చుకున్నాను.
ఆయనకు ఆ యాక్సిడెంట్ కాకపోయి ఉంటె మరిన్ని మంచి పాత్రల్లో మనకు కనువిందు చేసి ఉండేవారు.
హ్మ్, ఏంచేస్తాం!