Saturday, April 23, 2011

లటక్కన పెగ్గేసి చటుక్కున మూతి తుడుచుకుంటాం

పెగ్-1
మందు విషయంలో మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
సాయంత్రం ఇంటికి వచ్చేసరికి మా ఆవిడ వంట చేస్తూంటుంది.
వంటింట్లోంచి పాత్రల శబ్దం వినిపిస్తూ ఉంటుంది.
మనం పిల్లిలా ఇంట్లో దూరుతాం.
చెక్కబీరువాలోంచి మందు బాటిల్ తీస్తాం.
ఫొటోలో తాతగారు నవ్వుతూ చూస్తారు.
ఈ చెవిలో సద్దు ఆ చెవిలో పడనివ్వం.
ఎందుకంటే... మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
ఎవరూ వాడని బాత్రూం అటక మీంచి గ్లాసందుకుంటాం.
లటక్కన పెగ్గేసి చటుక్కున మూతి తుడుచుకుంటాం.
గ్లాసు కడిగేసి అటక మీద పెట్టేస్తాం.
తాతగారు బోసినవ్వుతో చూస్తారు.
వంటింట్లోకి తొంగి చూస్తాను.
మా ఆవిడ చపాతీపిండి కలుపుతూంటుంది.
ఈ చెవిలో సద్దు ఆ చెవిలో పడనివ్వం.
ఎందుకంటే... మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
మా ఆవిడకూ నాకూ మధ్య సంభాషణ మొదలవుతుంది.
నేను: శర్మగారమ్మాయి పెళ్లి సంగతేమైంది?
మా ఆవిడ: తిన్నగా ఉంటే కదా, మంచి సంబంధాలు రావడానికి!

పెగ్-2
మనం మళ్లీ ఇవతలికి వస్తాం.
చెక్కబీరువా తలుపు చప్పుడు చేస్తుంది.
మనం మాత్రం నిశ్శబ్దంగా బాటిల్ తీస్తాం.
లటక్కన పెగ్గేసి చటుక్కున మూతి తుడుచుకుంటాం.
బాటిల్ కడిగేసి అటకమీద పెట్టేస్తాం.
ఈ చెవిలో సద్దు ఆ చెవిలో పడనివ్వం.
ఎందుకంటే... మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.

నేను: మన శర్మ కూతురు అప్పుడే పెళ్లీడుకొచ్చేసిందా?
ఆవిడ: ఇంకా పెళ్లి వయసేమి? అడ్డగాడిదలా ముప్ఫైయ్యేళ్లొస్తుంటే!

పెగ్-3
మనం మళ్లా చెక్కబీరువాలోంచి చపాతీపిండి తీస్తాం.
చెక్కబీరువాలో బాత్రూం ప్రత్యక్షమవుతుంది.
బాటిల్ తీసి అటకలో రెండౌన్సులు పోస్తాం.
లటక్కన పెగ్గేసి చటుక్కున మూతి తుడుచుకుంటాం.
తాతగారు పడీపడీ నవ్వుతుంటారు.
అటకని పిండిమీద పెట్టేసి తాతయ్యని కడిగేసి చెక్కబీరువాలో పెట్టేస్తాం.
మా ఆవిడ పొయ్యిమీద బాత్రూం పెడుతుంది.
ఈ బాటిల్లో సద్దు ఆ బాటిల్లో పడనివ్వం.
ఎందుకంటే... మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
నేను: ఏంటే? మా శర్మగారిని గాడిదంటావా... తోలు వలిచేస్తాను.
ఆవిడ: ఊరికే గొడవ చేయకుండా వెళ్లి పడుకోండి!

పెగ్-4
మనం పిండిలోంచి బాటిల్ తీస్తాం. చెక్కబీరువాలోంచి ఓ పెగ్ కలుపుతాం.
బాత్రూంని కడిగేసి అటకమీద పెట్టేస్తాం.
మా ఆవిడ ఫొటోలోంచి నవ్వుతూ చూస్తుంటే గాంధీ వంట చేస్తుంటాడు.
ఈ శర్మ సంగతి ఆ శర్మగాడికి తెలియనివ్వం.
ఎందుకంటే... మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
నేను: ఇంతకీ శర్మగాడి పెళ్లి ఆ గాడిదతో అయ్యిందా లేదా?
ఆవిడ: నెత్తిమీద బక్కెట్ నీళ్లు పోశానంటే... వెళ్లండి, బయటికి!

పెగ్-5
నేను మళ్లీ కిచెన్లోకి వెళ్తాను.
నిశ్శబ్దంగా అటకమీద కూర్చుంటాను. 

డ్రాయింగ్‌రూంలోంచి బాటిళ్ళ శబ్దం వినిపిస్తుంటుంది.
తొంగిచూస్తే... మా ఆవిడ బాత్రూంలో మందేస్తుంటుంది.
వెంటనే లటక్కన మూతేసి చటుక్కున పెగ్గు తుడుచుకుంటాం.
ఈ గాడిద చప్పుడు ఆ గాడిద చెవిలో పడనివ్వం.
అఫ్కోర్స్ తాతయ్య ఎప్పుడూ రిస్క్ తీసుకోడు.
శర్మ వంట చెయ్యడం పూర్తయ్యేవరకూ మనం ఫొటోలో కూర్చుని మా ఆవిణ్ని చూస్తూ నవ్వుతుంటాం.
ఎందుకంటే... మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.

మరాఠీమూలం: నెట్ లో అజ్ఞాత రచయిత
తెలుగు అనువాదం: జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి.

16 comments:

  1. హహహహ చాలా బావుంది, చదువుతున్నంతసేపు పడీపడీ నవ్వుతూనే ఉన్నాం. :D :D

    ReplyDelete
  2. ఈ ‘తాగుడుమూతలు’ నేనెక్కడో ఇంతకుముందే చదివానోచ్! ఆ ఎక్కడ అనేది (ఏ పత్రికలో) మీరే చెప్పాలి!
    ఔనూ... పెగ్-5 తర్వాత ఏం జరిగిందీ? నెత్తిమీద నీళ్ళు భళ్ళున పడ్డాయా?

    ReplyDelete
  3. చదువుతున్నంత సేపూ నా నోరు అసలు రిస్కు తీసుకోలేదు,

    కింది పెదవిని పై పెదవిని కలవ నివ్వలేదు.

    హాహాహః

    ReplyDelete
  4. kekaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa

    ReplyDelete
  5. ఆత్రేయగారూ :)

    సౌమ్యగారూ, మొదటిసారి చదివినప్పుడు నా పరిస్థితీ అంతేనండీ. ఇప్పటిక్కూడా చదివినప్పుడల్లా పెదవులపై చిరునవ్వు పూస్తూనే ఉంటుంది.

    కొత్తపాళీగారూ,
    హమ్మమ్మ ఎంతమాట! మీరిచ్చిన లింక్ చూశాను. అందులో కామెంట్ల విభాగంలో చైతన్యగారిచ్చిన లింకూ చూశాను. హ్మ్... నాలుగేళ్లు లేటన్నమాట నేను.

    వేణుగారూ,
    మీరు మరీనూ... కొత్తపాళీగారిచ్చిన లింకులో కామెంట్ల విభాగంలో చైతన్యగారి కామెంటు చదివుంటే మీరీ ప్రశ్న వేసి ఉండేవారు కాదు. సరే, మీకు నచ్చినట్టే చెబుతాను. ఈప్రశ్నకు సమాధానం మీకు తెలిసీ చెప్పకపోతే... :) సరే, చెప్పేస్తున్నాను. 2007లో ఈనాడు ఆదివారంలో
    ప్రచురితమైందిది.
    ఇహపోతే, పెగ్-5 తర్వాత నెత్తిమీద నీళ్ల్లు... పడే ఉంటాయ్!

    బులుసు సుబ్రహ్మణ్యంగారూ :)

    అజ్ఞాత@April 25, 2011 3:05 AM
    మీ ప్రశంసలు దక్కాల్సింది మరాఠీ మూల రచయితకూ, దాన్ని ఇంత బాగా అనువదించిన జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తిగారికీ.
    నెనర్లు.

    రాజేష్ గారూ
    థాంక్యూ.

    ReplyDelete
  6. facebook ku forword cheyyataniki avakasam kalpinchinte baaga undedi. Maa frieds ku kuda chupinche vanni. Radha krishna

    ReplyDelete
  7. రాధాకృష్ణగారూ, నెనర్లు. ఇక్కడ తెలుగులో ఉన్న మ్యాటర్ని కాపీ చేసి మీ ఫేస్ బుక్ వాల్ పై పేస్ట్ చెసుకోవచ్చనుకుంటానండీ. నాకూ అంతగా ఐడియా లేదు.

    ReplyDelete
  8. @బాలు, మీ బ్లాగులోనే ఫేస్‌బుక్ విడ్జెట్ కూడా పెట్టుకోవచ్చు. మీకే గనక ఫేస్‌బుక్ పేజి ఉంటే, బ్లాగు టపాలు తమంత తాము అక్కడ కూడ కనబడేట్టు కూడా సెట్ చేసుకోవచ్చు.

    ReplyDelete
  9. కొత్తపాళీగారూ, లేటుగా స్పందిస్తున్నందుకు సారీ,
    స్థలమార్పు, స్థానమార్పు, ఉద్యోగ మార్పుతో జీవితం అస్తవ్యస్తమైంది(మరీ బరువైన డైలాగు పడ్డట్టుంది). కొత్తకాలనీ కావడంతో నెట్టు కనెక్సన్ లేదు. ఇప్పుడిప్పుడే పరిస్థితి కుదుటపడుతోంది. మళ్లీ మొదలెడతా! ఫేస్ బుక్కులో నాకు ఖాతా అయితే ఉందిగానీ, ఎందుకో అందులోకి తొంగిచూడబుద్ధి కాదు. అయినా ఆ ప్రాసెస్ చెప్తే ప్రయత్నిస్తాను. నెనర్లు.

    ReplyDelete
  10. avunu...nenu kooda chadivaanu..))))))))))

    ReplyDelete
  11. అద్భుతం...మాటలు లేవు....

    ReplyDelete
  12. మూడో పెగ్గుకే వెళ్ళం. ఎందుకంటే మనం అస్సలు రిస్కు తీసుకొం. బకెట్టు నీళ్ళు పోయించుకుంటే అన్నిరకాలుగా వృధా అయిపొడ్డి గదా! అందుకే బాటిల్ చప్పుడు గ్లాసుకి వినపడనివ్వం. తాతగారి ఫోటో పూజ గదికి మార్షేష్టం. ఇక షాలు బావోయ్!
    అద్భుతంగా తెనుగీకరించిన జొన్నవిత్తుల రాధాకృష్ణ మూర్తి గారికీ -- అంట అందంగా అందించిన మీకు ధన్యవాదాలు.

    ReplyDelete